ఒగ్గు కథ అనువాదం - తులనాత్మక అనుశీలన
Keywords:
ఒగ్గు కథ, ఒగ్గు, ఒగ్గోళ్ళు, బీరోళ్ళు, జానపద సాహిత్యం, అనువాదం, భాషాంశాలు, సాంస్కృతికాంశాలు.Synopsis
తెలంగాణ జానపద సాహిత్య సంప్రదాయంలో ఒగ్గు కథ ప్రముఖ కళారూపం. శతాబ్దాలుగా మౌఖిక సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ప్రక్రియ తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, విశ్వాసాలు, జీవన విధానం, భాషా వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. ఒగ్గు కథలు కేవలం వినోద సాధనాలు మాత్రమే కాకుండా సమాజపు సాంస్కృతిక అంశాలను తరతరాలకు అందించే వారసత్వ సంపదగా గుర్తింపుపొందాయి.
ప్రస్తుత అధ్యయనం ఒగ్గు కథ అనువాద ప్రక్రియను కేంద్రంగా చేసుకొని, అనువాదంలో ఎదురయ్యే భాషాపరమైన, సాంస్కృతిక పరమైన సవాళ్లను విశ్లేషిస్తుంది. జానపద కథనాలలో అంతర్లీనంగా ఉండే ప్రాంతీయ పదజాలం, సామెతలు, జాతీయాలను మరో భాషలోకి తీసుకువెళ్లే క్రమంలో అనువాదకుడు ఎదుర్కొనే సమస్యలను ఈ పరిశోధన పరిశీలిస్తుంది. అలాగే మూలంలోని భావసంపదను, జానపద స్వరూపాన్ని, సాంస్కృతిక ప్రత్యేకతను కాపాడుతూ లక్ష్యభాష పాఠకులకు అర్థవంతంగా అందించే అనువాద వ్యూహాలను చర్చిస్తుంది.
References
1. ఐవిర్, వ్లాదిమిర్. Procedures and strategies for the translation across cultures. న్యూ ఢిల్లీ: బహ్రీ పబ్లికేషన్స్.
2. భిక్షు, N. J. A. Theatrical Study of Oggu Katha A Narrative Folk Form of a Pastoral Community in Andhra Pradesh(పిహెచ్ డి సిద్ధాంత గ్రంథం), హైదరాబాద్ విశ్వవిద్యాలయం:2000.
3. భుజంగరెడ్డి, బాణాల. సాహిత్యానువాదంలో సమస్యలు. హైదరాబాదు: సాయి తిరుమల ప్రింటర్స్, 1968.
4. రామారావు, చేకూరి. భాషాంతరంగం: భాషా నిర్మాణ వ్యాసాలు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, 1975.
5. రంగారావు. The classic Telugu Short stories. న్యూ ఢిల్లీ: పెంగ్విన్ బుక్స్.
6. సరిత, ధరంసోత్. వరంగల్ జిల్లా ఒగ్గు కథలు – పరిశీలన. పిహెచ్ డి సిద్ధాంత గ్రంథం: హైదరాబాదు విశ్వవిద్యాలయం, 2023.
7. శంకరనారాయణ, పి. ఇంగ్లీషు – ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు. విజయవాడ: విక్టరీ పబ్లిషర్స్, 2007.
Downloads
Published
Data Availability Statement
This dissertation is based on the study of Oggu Katha and its translation. The data used for this research were collected from primary and secondary sources, including Oggu Katha texts, books, articles, and related scholarly works. All relevant data are incorporated within the dissertation. Additional information may be obtained from the author upon reasonable request.
